Fact Check: దగ్గుబాటి పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయలేదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పురందేశ్వరి రాజీనామా చేసినట్లు నకిలీ లేఖ

By Sridhar  Published on  23 March 2024 7:05 PM GMT
Daggubati Purandeswari resigned as BJP State President, Andhra Pradesh BJP State President resigned
Claim: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి దగ్గుబాటి పురందేశ్వరి రాజీనామా చేసినట్లు ఓ లేఖ వైరల్‌గా మారింది
Fact: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి దగ్గుబాటి పురందేశ్వరి రాజీనామా చేయలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, లెటర్‌హెడ్‌లు, పార్టీ గుర్తులతో కూడిన నకిలీ లేఖలు సోషల్ మీడియాలో ప్రచారం కావడం మనం చూస్తున్నాం.

ఇటీవల, ఆంధ్రప్రదేశ్ బీజేపీ లెటర్‌హెడ్‌తో కూడిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి దగ్గుబాటి పురందేశ్వరి రాజీనామా చేస్తున్నట్లు, వైజాగ్ డ్రగ్ కేసులో తన బంధువు పేరు రావడమే తన రాజీనామాకు కారణమని లేఖలో పేర్కొన్నారు.



ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పురందేశ్వరి రాజీనామా చేసిందంటూ వచ్చిన లేఖ నకిలీదని న్యూస్‌మీటర్ కనుగొంది.
వైరల్ లెటర్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడం ద్వారా, మేము బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికారిక హ్యాండిల్ ద్వారా Xపై ఒక పోస్ట్‌ని కనుగొన్నాము.
"ముఖ్య సూచన
సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతున్న ఈ లెటర్ ఒక ఫేక్ లెటర్.
NDA కూటమి వ్యతిరేక శక్తులు ప్రచారం చేస్తున్న ఫేక్ న్యూస్ అని గమనించగలరు అని" ఆ పోస్ట్ పేర్కొంది.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ
చివరికి ఇది కేవలం నకిలీ లేఖ మాత్రమే. దీనిపై వెంటనే స్పందించిన బీజేపీ, దీనిని నమ్మవద్దని ప్రజలను కోరింది.
మంగళవారం విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్‌లో షిప్పింగ్ కంటైనర్‌ను CBI అదుపులోకి తీసుకుని అనుమానిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. గురువారం CBI అధికారులు కార్గోను పరీక్షించి డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
“ఈ అంతర్జాతీయ డ్రగ్ చైన్‌లో ప్రమేయం ఉన్న సరుకును మరియు ఇతరులను గుర్తించడంలో మేము CBI అధికారులకు సహాయం చేస్తున్నాము. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు’’ అని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ తెలిపారు.
వైజాగ్ డ్రగ్ కేసుపై CBI ప్రెస్ రిలీజ్ నోట్‌ను X పై బిజెపి ఆంధ్రప్రదేశ్ హ్యాండిల్ షేర్ చేసింది, YSRCP ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, విమర్శించింది. అదే పోస్ట్‌ను పురందేశ్వరి తన X ఖాతాలో రీపోస్ట్ చేసారు.
అందుకే, దగ్గుబాటి పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారంటూ వచ్చిన లేఖ నకిలీదని మేము నిర్ధారించాము.

Claim Review:A viral letter claims that Daggubati Purandeswari has resigned as the Andhra Pradesh BJP State President
Claimed By:X and Facebook users
Claim Reviewed By:News Meter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:False
Next Story