Fact Check: పార్టీ కార్యకర్తలు కుర్చీలు విసిరి కొట్లాడుకునే వీడియో ఆంధ్రప్రదేశ్‌కి చెందినది కాదు తమిళనాడుకు చెందినది

తమిళనాడులో జరిగిన ఓ ఘటనను ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు

By Sridhar  Published on  12 April 2024 12:20 PM GMT
Fight in Vijayawada at TDP BJP JSP Athmeeya meeting, Party workers threw chairs in Athmeeya meeting

ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ లు కలిసి కూటమిగా (ఎన్డీయే) ఏర్పడిన సంగతి తెలిసిందే. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ఎన్డీయే కూటమి పోటీ చేయనుంది.

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ భారీ బహిరంగ సభలు, క్యాడర్ సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగిన ఆత్మీయ సమావేశంలో TDP BJP JSP కార్యకర్తలు కుర్చీలతో వాగ్వాదానికి దిగారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"07/04/2024 ఈ రోజు అనగా ఆదివారం TDP BJP JSP విజయవాడ ఆత్మీయ సమావేశం లో కుర్చీలతో ముష్టి యుద్ధం చేసుకుంటున్న కార్యకర్తలు. అది అలా కలిసిమెలిసి కొట్టుకుంటూ ఉండాలి." అంటూ ఆ వీడియోను షేర్ చేశారు.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ




నిజ నిర్ధారణ:

తమిళనాడులో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోను, విజయవాడలో జరిగిన ఆత్మీయ సమావేశానికి చెందినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని న్యూస్‌మీటర్ కనుగొంది.

మొదటగా ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ‘ఆత్మీయ సమ్మేళనం’ సమావేశాలకు సంబంధించిన వార్తలు, వీడియోల కోసం వెతకగా. ఆంధ్ర ప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో జరిగిన సమావేశాల నివేదికలు, వీడియోలు మాకు లభించాయి. అయితే ఈ సమావేశాల్లో విజయవాడలో గానీ, ధర్మవరంలో గానీ పార్టీ కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నట్టు గానీ గొడవకి దిగినట్టు లేదా వేరే ఎలాంటి గొడవలు జరిగినట్లు సమాచారం లేదు.

అప్పుడు వైరల్ వీడియో ని లోతుగా పరిశీలించిన తర్వాత 'న్యూస్ 18' లోగో తో పాటు వెనకాల బ్యానర్ మీద తమిళ్ భాషలో రాయబడిన రాతని మనం చూడవచ్చు.

వైరల్ వీడియో యొక్క కొన్ని సంబంధిత కీలకపదాలు మరియు కీఫ్రేమ్‌లను ఉపయోగించి సెర్చ్ చేయగా, న్యూస్ 18 తమిళనాడు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో “మక్కల్ సభై” పేరుతో ఎన్నికలకు సంబంధించిన చర్చలను నిర్వహిస్తున్నట్లు మేము కనుగొన్నాము. ఏప్రిల్ 6, 2024 న న్యూస్ 18 తమిళనాడు కాంచీపురంలో మక్కల్ సభను నిర్వహించింది.


అయితే న్యూస్ 18 తమిళనాడు లైవ్ స్ట్రీమ్ వీడియోలో, కుర్చీలు విసురుకోవడం గానీ గొడవకి దిగినట్టు వీడియో క్లిప్‌లు లేకపోయినప్పటికీ.. లైవ్ స్ట్రీమ్ వీడియోలో మేము వేదికకు సంబంధించిన విజువల్స్‌ను పోల్చి చూడగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో కాంచీపురంలో జరిగిన న్యూస్ 18 “మక్కల్ సభై” మీటింగ్‌లోని వీడియో అని నిర్దారించాము.

మేము మరింత శోధించినప్పుడు, ఈ సంఘటనను నివేదించిన "DMK గూండాలు న్యూస్ 18 తమిళనాడు యొక్క డిబేట్ షో లో బీజేపీకి చెందిన SG సూర్య నుండి విమర్శలను స్వీకరించలేక పోయారు" అనే శీర్షికతో వార్తా కథనాన్ని కనుగొన్నాము.


6 ఏప్రిల్ 2024 న న్యూస్ 18 తమిళనాడు ఛానెల్ కాంచీపురంలోని ఉమా మురుగన్ మహల్‌లో “మక్కల్ సభై” పేరుతో ప్రత్యక్ష కార్యక్రమాన్ని నిర్వహించింది.
DMK తరపున కాంచీపురం ఎమ్మెల్యే ఎజిలరసన్, BJP నుంచి డాక్టర్ ఎస్‌జీ సూర్య, CPM నుంచి బాలభారతి, AIADMK నుంచి కళయన్‌సుందరం, TMK నుంచి బాద్షా, NTK నుంచి కజాంజియం ఈ ప్యానెల్‌లో ఉన్నారు. ఈ కార్యక్రమానికి కరస్పాండెంట్ బాలవేల్ చక్రవర్తి హోస్ట్‌గా వ్యవహరించారు.
తీవ్రమైన చర్చ, ముఖ్యంగా BJP మరియు DMK ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.BJP రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జి సూర్య ఖండనతో DMK మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తతలు పెరిగాయి, ఇది హాజరైన వారి మధ్య భౌతిక వాగ్వాదానికి దారితీసింది. ఘర్షణ మధ్య కుర్చీలు విసిరి వేయడాన్ని కలతపెట్టే వీడియో రికార్డ్ చేయబడింది. అని ఈ వార్త నివేదిక పేర్కొంది.

ఈ ఘటనపై స్పందిస్తూ, డీఎంకే చర్యలను ఖండిస్తూ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జీ సూర్య X హ్యాండిల్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, “ఆలోచనలతో ఆలోచనలను ఎదుర్కోవడంలో డీఎంకే శక్తి లేనిది. ఈరోజు కాంచీపురంలో న్యూస్ 18 తమిళనాడు "మక్కల్ సభై " కార్యక్రమంలో డీఎంకే దుండగులు బీజేపీ సభ్యుల పై దాడి చేశారు. డిఎంకె ఎమ్మెల్యే మిస్టర్ ఎజిలరసన్ ఎదుట కుర్చీలు విసిరి థర్డ్ క్లాస్ పదాలు వాడుతూ అసభ్యంగా ప్రవర్తించారు.
అందువల్ల విజయవాడలో జరిగిన TDP BJP JSP ఆత్మీయ సమావేశంలో పార్టీ కార్యకర్తలు కుర్చీలు విసిరి కొట్లాటకు దిగారనే వాదన అవాస్తవమని తేల్చిచెప్పాం.
Claim Review:A video showing party workers throwing chairs and fighting at Vijayawada TDP BJP JSP Athmeeya meeting
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:Misleading
Next Story